సఖి లీగల్ అడ్వైజర్ అనూష
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
హన్మకొండ జిల్లా హసన్ పర్తి, దేవన్నపేట్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సఖి లీగల్ అడ్వైజర్ అనూష ముఖ్య అతిథిగా హాజరయ్యారు సఖి వన్ స్టాప్ సెంటర్ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతుందని ఐదు రకాల సేవలు కౌన్సిలింగ్ సహాయం, న్యాయ, వైద్య, పోలీస్, తాత్కాలిక వసతి సేవల గురించి వివరించారు సఖి సెంటర్ 24 గంటలు పని చేస్తుందని సమస్య ఉన్న మహిళలు 181 మహిళ హెల్ప్ లైన్, చైల్డ్ లైన్ నెంబర్ 1098, 0870-2452112, 7382983088 అను నెంబర్లకు కాల్ చేసి బాధిత మహిళలు సహాయం పొందవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో కుమార్, సీసీలు, సఖి కేసు వర్కర్ భారతి, తదితరులు పాల్గొన్నారు.

