Sunday, March 22, 2026

*ప్రతి వార్డులో అభివృద్ధే లక్ష్యం – క్యాతనపల్లి 14వ వార్డులో సీసీ రోడ్ ప్రారంభం*

నేటి సాక్షి మార్చి 22:(మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ ప్రజల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు తెలిపారు.క్యాతనపల్లి మున్సిపాలిటీ 14వ వార్డులో రూ.24 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ప్రజల సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమాన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News