నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి)
కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ స్వయంగా మొక్కలు నాటడం జరిగింది. మరియు మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మనిషికి ఒక మొక్క అనే నినాదం తో మొక్కలు నాటడం జరిగింది.
ఈ కార్యక్రమం ను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ
వన మహోత్సవం -2025 కార్యక్రమాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు.
ప్రతి ఆడబిడ్డ ఇంట్లో కనీసం రెండు మొక్కలైనా నాటాలని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఆడబిడ్డ రెండు మొక్కలు నాటితే రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందని,
మనం చెట్టును కాపాడితే, చెట్టు మనల్ని కాపాడుతుంది.
ఆడబిడ్డలు ఇంట్లో పిల్లలను పెంచుతున్నట్టుగానే ఇంటి ఆవరణలో కనీసం రెండు మొక్కలను నాటాలి. ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందని, అనుభవంతో నేర్చుకున్న పాఠాలు. అమ్మ పేరు మీద పిల్లలు మొక్కలు నాటాలన్న తరహాలోనే, పిల్లల కోసం అమ్మ కూడా రెండు మొక్కలు నాటాలని, అలా చేస్తే తెలంగాణ మొత్తం హరితవనంగా మారుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, అకౌంటెంట్ ఆఫీసర్ శివ కుమార్, ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ క్రాంతి కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మహేష్, మెప్మా సిబ్బంది టి.ఎం.సి శ్రీరాం, సి.ఓ లు సంధ్యా, గంగారాణి, మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.