—- మహేశ్వరం నియోజకవర్గంలో 48 క్లాస్టర్లకు 480 ఇన్ఛార్జులు నియామకం.
—- నియామక పత్రాలు అందించిన అబ్జర్వర్ ధారాసింగ్
నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)
గ్రామీణ స్థాయిలో పని చేసే కార్యకర్తలు, నాయకులకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం అబ్జర్వర్ ధారాసింగ్ అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో 48 క్లాస్టర్లల్లో 480మంది ఇన్ఛార్జిలు, బూత్ స్థాయిలో పదిమంది కో-ఆర్డినేటర్స్ ను కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియమించారు.
ఈ సందర్భంగా ధారాసింగ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఇన్ఛార్జిలు, కో-ఆర్డినేటర్స్ వ్యవస్థలు దోహదపడతాయని అన్నారు.ప్రతీబూత్, గ్రామం, డివిజన్, వార్డుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రతీ గడపకు తీసుకెళ్లాలని ధారాసింగ్ అన్నారు.
పార్టీ కో- ఆర్డినేటర్స్, ఇన్ఛార్జులకు ఈ సందర్భంగా కేఎల్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

