నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 03 (సందెల రాజు)రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్- నవంబర్ 15వ తేదీన శనివారం రోజున ప్రత్యేక లోక్ అదాలత్ ను నిర్వహించ తలపెట్టామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ వి బి నిర్మల గీతాంబ తెలిపారు.వరంగల్ న్యాయ సేవా సదనం బిల్డింగ్ లో రెండు వేర్వేరు సమావేశాలను నిర్వహించడం జరిగింది. మొదటగా ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ మరియు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ నవంబర్, 15-2020 శనివారం రోజున నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ/కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులను మరియు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కనుక ఇన్సూరెన్స్ బ్యాంకు మరియు చిట్ ఫండ్ అధికారులు కోర్టులలో పెండింగ్ లలో ఉన్న తమ తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు. కోర్టు లలో లేని కేసులను ప్రీ- లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థ లో పరిష్కరించు కోవాలని తెలిపారు. ప్రి-లిటిగేషన్ కేసుల విషయాలలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని సంప్రదించాల ని తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంక్ మరియు చిట్ ఫండ్ కేసుల పరిష్కారం కొరకు ఏవైనా సలహాలు, సూచనలు అవసరమైనట్లయితే న్యాయసేవాధికార సంస్థ ను నేరుగా సంప్రదించి, సలహాలు పొందవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ పట్ల వారి వారి సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, ఎక్కువ కేసులు పరిష్కరించ బడుటకు పోలీసు ఉన్నతాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, న్యాయవాదులు, చిట్ ఫండ్, బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా తెలియ జేశారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయ మూర్తులు న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి ఎం. సాయి కుమార్, ఇతర న్యాయ మూర్తులు, పోలీస్ ఉన్నతాధికారులు గిరి కుమార్ కలకోట, నరసయ్య, రవీందర్ రెడ్డి, యన్.వెంకటేష్ ఇతర పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు పాల్గొన్నారు.





