Monday, March 16, 2026

ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలం నందు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ డిజిపి .. హరీష్ కుమార్ గుప్తా నంద్యాల జిల్లా శ్రీశైలం

నేటి సాక్షి 14 :—అక్టోబర్ 16 న భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం నందు పర్యటించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిజిపి .హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ , భద్రత ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా డిజిపి , ప్రధాని పర్యటించే ప్రదేశాలలో హెలిపాడ్,రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం ,గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిజిపి గారితో పాటు కర్నూలు రేంజి డిఐజి .కోయ ప్రవీణ్ ఐపీఎస్ ,ఈగల్ టీం ఐజీ .ఆకే. రవికృష్ణ ఐపీఎస్ , నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్‌ ఐపీఎస్ , అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్. ఏఎస్పి. ఎం.జావళి ఐపీఎస్, ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ ,పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News