*నేటిసాక్షి* ఏప్రిల్ 7 తిరుమలాయపాలెం (రుద్రరాజు).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవము కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం గురించి మెడికల్ ఆఫీసర్ వసుంధర మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న నిర్వహించే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సుబ్లేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్థాయిలో వైద్య సేవలు అందించడం ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని ఆహార భద్రతలు తీసుకోవాలని ఒత్తిడి తగ్గించుకోవాలి అప్పుడే బిపి, మధుమేహం, ఉబ్బకాయం, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయని ఇలాంటి సేవలు ప్రజలకు చేరవేయడంలో ఆశా వర్కర్లు ఎప్పుడూ ముందంజ ఉంటారని కొనియాడారు. ఆశాల సేవలను గుర్తించి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆశా వర్కర్లను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూక్య కనిల్ కుమార్, కార్యదర్శి రాజ్ కుమార్, ఎంపీడీవో షేక్ సిలర్ సాహెబ్, ఎస్సై కూచిపూడి జగదీష్, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





