నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రభుత్వం యూరియా బుకింగ్ లో తీసుకువచ్చిన ఆన్లైన్ నమోదు ను వెంటనే రద్దుచేసి సాధారణ పద్ధతిలోనే రైతులకు యూరియాను అందించాలని, నియోజకవర్గ పరిధిలోని దామరచర్లమండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం ఆవరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా యూరియా నమోదును వెంటనే రద్దుచేసి, సాధారణ పద్ధతిలోనే ప్రభుత్వ గోదాంలోనే రైతులకు యూరియాను అందించాలని, ఆన్లైన్ యాప్ లో నమోదులో చిన్న, సన్నకారు చదువురాని రైతులు, మరియు పాస్ పుస్తకాలు లేని రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దామరచర్ల మండలంలో రైతులకు యూరియా కొరత కృత్రిమంగా సృష్టిస్తూ, పిఎసిఎస్, ఆగ్రో సెంటర్లలో యూరియా వచ్చినప్పుడు మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోండని రైతులకి సలహాలిస్తూ, ప్రైవేటు ఫర్టిలైజర్స్ షాపులలో యూరియా లోడ్లు దిగినప్పుడు మాత్రం యూరియా ఆన్లైన్లో బుక్ చేసుకోండి అని రైతులకు సమాచారం అందించట్లేదని ఆరోపించారు. ప్రైవేటు ఫర్టిలైజర్ షాపు యజమానులు యూరియా లోడ్ వోచ్చినప్పుడు రైతులకు సమాచారం ఇవ్వట్లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా అధిక ధరలకు రైతులకు యూరియాను విక్రయిస్తూన్నారని అన్నారు. మండల కేంద్రంలో ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో నకిలీ విత్తనాలు, నకిలీ నీళ్ల మందులు గుంటూరు నుండి తెచ్చుకొని, ఫర్టిలైజర్ షాపు యాజమాన్యాలు రైతుల నుండి లక్షల రూపాయలు అక్రమంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని, వెంటనే సంబంధింత అధికారులు అన్నిఫర్టిలైజర్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, రైతుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, దామరచర్ల మండలంలో ప్రైవేటు పార్టీలేయర్ షాపు యాజమాన్యాలు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టి, నిరుపేదా నిరక్షరాస్యులైన రైతులకు న్యాయం చేయాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే యాప్ ఆన్లైన్ ను రద్దు చేసి, సాధారణ పద్ధతిలోనే సరఫరా చేసేలా సంబంధిత ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంబయ మాదిగ, దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గుగులోతు శారద నాయక్, రైతులు అశోకు, కాతోజు రమేష్, కంభంపాటి నాగేందర్, శ్రీనివాస్,రాజు, పాచు నాయక్, శ్యామ్ సుందర్ మాదిగ, రజిని, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

