నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెటుపల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎం లతో మరియు గర్భిణీ స్త్రీలతో సమన్వయ సమావేశము మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా.ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ వంద శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యేటట్లుగా ప్రతి గర్భిణీ స్త్రీ కి అవగాహన కలిగించాలని సిబ్బందికి సూచించారు. సాధారణ కాన్పుల వల్ల కలిగే లాభాలు గురించి గర్భిణీ స్త్రీలకు మరియు తల్లులకు గ్రామాలలో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు అందించే సేవల గూర్చి క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు ,ఆశలు వివరించాలని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు డా. కె .ప్రమోద్ కుమార్ పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ సాజిద్,ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, జిల్లా మాత శిశు అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సమ్యుద్దిన్, గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

