నేటి సాక్షి. కొడిమ్యాల
21.జూన్
ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రధానోపాధ్యాయులు విజయేంద్ర. ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు విజయేంద్ర. మాట్లాడుతూ యోగ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు ఏకాగ్రత పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఉమ, యువనాయకులు బోగ.రాకేష్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

