నేటి సాక్షి. కొడిమ్యాల
21.జూన్
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునిక మానవ జీవితం కాలంతోపాటు వేగంగా ప్రయాణిస్తుందని, దీంతో అనేక అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు దరిచేరుతున్నాయని, వీటిని అధిగమించడానికి యోగ సరైన మార్గమని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా యోగా సాధన చేసినట్లయితే శారీరక ఆరోగ్యం మెరుగుకావడతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు. కళాశాలకు చెందిన యోగ మాస్టరు బండ్ల భాస్కర్ విద్యార్థులతోపాటు అధ్యాపకుల చేత పలు యోగాసనాలను వేయించి వాటి ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పి. తిరుపతి, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.