నేటి సాక్షి.కొడిమ్యాల
- జూన్
కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం.మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. వేణు విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వలన వచ్చే అనారోగ్య సమస్యలను వివరించారు.
కళాశాల ఆంటీ డ్రగ్ కమిటీ సభ్యుడు బండ్ల భాస్కర్ మాట్లాడుతూ
డ్రగ్స్ మరియు మద్యం తాగడం అనేది ఒక వ్యసనంగా మారడం అనేది జబ్బు లాంటిదని దానికి విద్యార్థులు దూరంగా ఉండాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు, కళాశాల అధ్యాపకులకు తెలియజేసి సమాజంలో డ్రగ్స్ అరికట్టడంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

