*నేటి సాక్షి తొగుట.. వడ్డే నరసింహులుతెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో కమిషన్ పరిధిలో లేని ఉపాధ్యాయుల జీతాల గురించి ప్రస్తావించడం విడ్డూరమని,ఉపాధ్యాయులకు రెండు మూడు సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు రావడంలేదని ఉపాధ్యాయుల సమస్యలు ప్రస్తావించని కమిషన్ జీతాల గురించి ప్రస్తావించడంఉపాధ్యాయుల ప్రతిష్టకు భంగం కలిగించడమేనని *పి ఆర్ టి యు తొగుట మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామచంద్ర రెడ్డి సురేందర్ రెడ్డి* గార్లు అన్నారు.పేదవాళ్లను ప్రభుత్వ విద్యకు దూరం చేసే చాలా విషయాలు ఈ నివేదిక లో ఉన్నాయని సమగ్రమైన అధ్యయనం చేయకుండా మండలానికి రెండు మూడు స్కూళ్లు మాత్రమే ఉండాలని పేర్కొనడం శోచనీయమని అన్నారు.ఉపాధ్యాయుల అర్హతల విషయంలో కూడా సాంకేతిక సంస్థలు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చిన సిఫారసులు చేయడం జరిగిందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను కుదించడం పేదవాళ్లకు ప్రభుత్వ విద్యను దూరం చేయడమేనని, వందల మంది విద్యార్థులను ఒకే చోట ఉంచడం వలన మధ్యాహ్న భోజనం మరియు టాయిలెట్స్ వినియోగం లో పారిశుద్ధ్య సమస్యలు, విద్యార్థులపై ఏకాగ్రత ఉంచడం మొదలగు సమస్యలు ఏర్పడతాయని వారు ఆక్షెపించడం జరిగినదిఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి విద్యా కమిషన్ సిఫారసులను పునః సమీక్షించాలని పిఆర్టియు తొగుట మండల శాఖ పక్షాన *పుల్లగుర్ల రామచంద్రారెడ్డి బత్తుల సురేందర్ రెడ్డి* డిమాండ్ చేశారు.





