Tuesday, January 20, 2026

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం… ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.ప్రభుత్వవిప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్ చార్జీలు 40%, కాస్మోటిక్ చార్జీలు 200% పెంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టిక ఆహారం అందించడానికి ఓకే మెను తయారుచేసి అందిస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తుందని తెలిపారు. విద్యా రంగానికి పెద్ద పీట వేస్తూ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టిరని తెలిపారు. శిక్షణ తరగతులు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.రాష్ట్రంలోని ప్రతి పెద విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మాణం కోసం 200 కొట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సైతం ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందిస్తున్నామన్నారు. మన ప్రాంతలో రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.గత పదేళ్లుగా నిర్లక్ష్యంగా మారిన విద్యలో మార్పు తీసుకువచ్చి, పెద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగి తల్లిదండ్రుల ఆశాయలను నెరవేర్చాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను స్వంత బిడ్డల వలె చూసుకుంటుంది. రాష్ట్రంలో విద్య సంవత్సరం మొదలు కాక ముందే రాష్ట్రంలోని ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.ఉపాధ్యాయుడిని అభినందించిన విప్….మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కపిల నరేష్ తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతిలో చేర్పించి విప్ చేతుల మీదగా అడ్మిషన్ పొందడం జరిగింది.. ప్రభుత్వ ఉపాధ్యాయుడై ఉండి తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం పట్ల విప్ నరేష్ ను అభినందించారు. ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News