పేట జిల్లా అధ్యక్షులుషేర్ కృష్ణారెడ్డి, నరసింహ నేటిసాక్షి, నారాయణపేట,జూన్ 4, నారాయణపేట ప్రభుత్వ బడుల పటిష్టత కోసమే తపస్ నిరంతరం కృషి చేస్తున్నదని ఆ లక్ష్యంగా విద్యార్థుల నమోదు మాసంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్ కృష్ణారెడ్డి నరసింహ తెలిపారు. బుధవారం వేద సరస్వతీ కళాశాలలో జరిగిన వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతోపాటు పాఠశాలల ప్రగతికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కార మార్గాలు, ఆపరేషన్ సింధూర్, ఆదర్శ ఉపాధ్యాయుడు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, అంశాలపై విభాగాల వారిగా పరస్పరం చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ గుంపు బాలరాజ్, జిల్లా గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్, జిల్లా మహిళా ప్రముఖ్ కెంచే విజయ,జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా బాధ్యులు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

