Tuesday, December 24, 2024

ప్రభుత్వ భూమి కబ్జా..

  • – అక్రమ వెంచర్​పై చర్యలు తీసుకోండి
  • – భారత కమ్యూనిస్టు పార్టీ మండల నాయకుడు

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోని 643 సర్వే నంబర్​లో కొంత ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మండల నాయకుడు సంగెం మధు కోరారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో కబ్జాకు గురైoదని ఆరోపిస్తూ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మధు మాట్లాడుతూ 643 సర్వే నెంబర్​కు సర్వేయర్​తో హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని విన్నవించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, భవిష్యత్ అవసరాలకు పనికి వచ్చేలా ఉపయోగించాలని కోరారు. అంతేకాకుండా స్థానిక ఎంపీడీవో లేఅవుట్ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురికావడం బాధాకరమన్నారు. నిత్యం అదే దారిలో వచ్చేటువంటి అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంపై ఆంతర్యం ఏమిటో అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దొంతరవేణి మహేష్ బోనగిరి శ్రావణ్, కల్లూరు బాలమల్లు, రొడ్డ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News