-ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలి
-సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం
నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల వ్యాప్తంగా గతంలో ఉన్న ప్రభుత్వ భూమి నేడు కనుమరుగు ఐనదని, వెంటనే ఆ భూములను ఆక్రమించిన భూస్వాములను ప్రభుత్వ రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని పేద రైతులకు పంపిణి చేయాలని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల సిపిఐ కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు తో కలిసి స్థానిక తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, భూభారతి చట్టం ద్వారా పేదలకు పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి ధనావత్ శాంతి, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్, సీనియర్ సిపిఐ నాయకులు జమ్ముల కోటయ్య కార్యవర్గ సభ్యులు పేరుపొంగు లక్ష్మయ్య పోలేపల్లి సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.





