*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్ సీని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువపై ఆరా తీశారు.రోజు ఆసుపత్రికి ఎందరు రోగులు వస్తున్నారని, ఎందరు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలుపాలని సూచించారు.ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




