నేటి సాక్షి ,నారాయణపేట, డిసెంబర్ 22, నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని ఎంనోని పల్లి గ్రామ సర్పంచ్ గా బోయ నరేష్, ఉప సర్పంచ్ గా సిద్ధప్పలు సోమవారం నాడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా వాడు సభ్యులుగా వర్ణమ్మ సిద్ధప్ప నరేష్, శ్రీవాణి ,బి. నర్సింలు ,శిల్ప, శేఖర్ ,భాను శ్రీ తదితరులు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తో పాటు కాంగ్రెస్ పార్టీ ధన్వాడ మండల అధ్యక్షులు నరహరి, గ్రామ పెద్దలు పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





