Friday, March 13, 2026

ప్రమాదకరంగా మారిన కల్వర్టు గుంతలు…. పట్టించుకోని అధికారులు…!? ఎంనోన్ పల్లి మాజీ సర్పంచ్ కావలి భారతి సచిన్ కుమార్….

నేటి సాక్షి నారాయణపేట అక్టోబర్ 20,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండల పరిధిలోని ఎంనోని పల్లి నుండి ధన్వాడ మండల కేంద్రానికి వెళ్లే రహదారి లో ఉన్న కల్వటు ప్రమాదకరంగా మారిన అధికారులు పట్టించుకోవడంలేదని యమునోన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావలి భారతి సచిన్ కుమార్ ఆరోపించారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ పలుసార్లు ఇట్టి రోడ్డు విషయంపై పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు ఏమి పట్టనట్టు ఉన్నారని ఆయన ఆరోపించారు. యమునంపల్లి నుండి ధన్వాడ కెళ్ళే రహదారి ఆదమరిస్తే వాహనదారులకు తీవ్ర గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు .గతంలో ఎంతోమందికి గాయాలని ఆయన గుర్తు చేశారు. వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోతే గ్రామస్తుల ఆధ్వర్యంలో ధన్వాడ మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ సర్పంచ్ కావాలి సచిన్ కుమార్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News