నేటి సాక్షి ప్రతినిధి డిసెంబర్ 18 శంకరపల్లి న్యూస్ భవన నిర్మాణంలో పనిచేస్తున్న ఓ మేస్త్రి ప్రమాదవశాత్తు కాలు జారీ కిందపడి మృతి చెందిన సంఘటన గురువారం శంకర్ పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. శంకర్పల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన అనరులోహక్ (31) ఏడు నెలల క్రితం బతుకుదెరువు నిమిత్తం తన అన్న తో కలిసి శంకర్ పల్లి కి వచ్చాడు. అప్పటినుంచి మేస్త్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పట్టణంలోని శాంటమ్ హోమ్స్ ( sanctum homes ) లో సీలింగ్ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. చికిత్స కోసం మొదట శంకర్పల్లిలోని లలిత హాస్పిటల్ కి తర్వాత మెరుగైన వైద్యం కోసం పటాన్చెరు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భవన నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తన సోదరుడి మృతి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మృతుడి అన్న ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.





