నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 06 :ప్రమాదవశాత్తూ వలలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం మండలంలో జరిగింది.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండా గ్రామానికి చెందిన బానోత్ వాల్య (62) . గ్రామ శివారులో పాలేరు రిజర్వాయర్ లో చేపలకు వల వేయగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో కాళ్లకు వల చిక్కుకొని మృతి చెందాడు.. మృతి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..





