నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధిప్రమాదాలు జరగని బాపట్లగా ప్రతి ఒక్కరూ తీర్చిదిద్దాలని ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ గౌరవాధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు.బాపట్ల కర్లపాలెం రహదారిలో సభ్యులు బీమా కోటేశ్వరరావు ఆర్ధిక సహకారంతో ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును మంగళవారం జంక్షన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేజెండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అత్యధిక సంఖ్యలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ప్రజలు మరణిస్తున్నారని,రోడ్డు ప్రమాదాల నివారించడానికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కొంతమేర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తూ, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. బాపట్లలో నాలుగు వైపులా ప్రమాదాలు జరగకుండా తమ వంతు బాధ్యతగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తూ ప్రజలలో మరింత అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసులు,మోటార్ వాహనాల తనిఖీ అధికారులు నిరంతరం రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేస్తున్నారని అందులో భాగంగా ఆర్గనైజేషన్ సభ్యులు బీమా కోటేశ్వరరావు ఆర్థిక సహాయంతో బాపట్ల కర్లపాలెం రహదారిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశామని చెప్పారు. బీమా కోటేశ్వరరావును ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బండ్రెడ్డి గోపి, కార్యదర్శి బత్తుల సురేష్, సంయుక్త కార్యదర్శి బొగ్గవరపు శివ,కోశాధికారి జోగి సువర్ణరాజు,విన్నకోట శ్రీనివాసరావు, బండ్రెడ్డి అంకమ్మ రావు, పెద్దమల్లు శ్రీకాంత్,సుబ్బారావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.





