( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 16:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ తుక్కుగూడలో కేఎల్ఆర్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.తుక్కుగూడ కార్యాలయంలో పలువురు రోగుల, బంధువులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంర్ఫ్) చెక్కులను కిచ్చెన్న అందజేశారు. ఈ సందర్భంగా కెఎల్ఆర్ మాట్లాడుతూ… ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ముందుండి సహాయం చేస్తారో… అదే విధంగా ఆరోగ్యరక్షణకు, పేదలకు వరంగా ఉన్న సీఎంర్ఫ్ కు ప్రముఖ కంపెనీలు నిధులు సమకూర్చాలని కోరారు.పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల ఉచిత కార్పొరేట్ వైద్యం, సిఏంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి), ఎల్ వో సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని కేఎల్ఆర్ అన్నారు.పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు సహా బంధువులు పాల్గొన్నారు.





