Friday, March 20, 2026

ప్రవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించండి – తనకంటి వేణుగోపాల్ రెడ్డి పార్టీ తరపున పదవి వచ్చిందనే ఆనందంలో పాఠశాలకు ఒక రోజు సెలవు..పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు భారీ డిన్నర్..విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కిన ఓ పాఠశాల కరస్పాండెంట్..

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 10 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణ అధ్యక్షతన మండలంలోని ప్రయివేట్ విద్యాసంస్థలకు చెందిన కరస్పాండెంట్ ల సమన్వయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, ఏపీ & తెలంగాణా విజిలెన్స్ చైర్మన్ తనకంటి వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని చూసించారు. జి.ఓ.1 కచ్చితంగా పాటించాలని తెలియజేశారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులనే నియమించాలని తెలిపారు. ఆటస్థలం, వాష్ రూమ్ పరిశుభ్రంగా ఉంచాలని, తరగతి గదులు తగినంత గాలి వెలుతురు ఉండేలాగా చూడాలని తెలియజేశారు. ములకలచెరువు మండలంలోని పలు విద్యా సంస్థలకు చెందిన వాటిలో చాలా అసౌకర్యాలు కొట్టుమిడుతున్నాయి. ఇరుకు గదులలో పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు సరైన మార్గం కూడా లేదు. సరస్వతి మీడియం స్కూలుకు చెందిన కరస్పాండెంట్ రాందాస్ కు ఓ రాజకీయ పార్టీలో పదవొచ్చిన ఆనందంలో ఒక రోజు పాఠశాలకు సెలవిచ్చాడు. విద్యా శాఖ నిబంధనలను తుంగలో తొక్కాడు. అంతటితో ఆగకుండా విద్యార్థులతో బల ప్రదర్శన చేశాడు. ఇలా ర్యాలీ నిర్వహించకూడదని ముందస్తు సమాచారం ఇవ్వకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారని పోలీసులు ఆయనను వెనక్కి పంపారు. అంతటితో ఆగకుండా స్కూల్ లోనే ఏకంగా డిన్నర్ ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను డిన్నర్ కు పిలిపించి ఏదో ఘనకార్యం చేసినట్టు తెగ బిల్డప్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో ములకలచెరువు లోని పలు విద్యాసంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై పత్రికలలో కథనాలు ప్రచూరించిన వీళ్ళ బుద్ధి మాత్రం మారలేదు. ఏం చేస్తారులే అనుకున్నారో ఏమో. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన పై అధికారుల నుండి ఎంఈఓ స్థాయి అధికారి వరకు వాళ్లకు అందాల్సింది అందుతుంది అందుతుంది. అందుకే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని గుసగుసలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇకనైనా బుద్ధి మార్చుకొని రాజకీయాలకు స్వస్తి పలికి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలని తల్లితండ్రులు కోరుతున్నారు. రాజకీయాలు రాణించాలనుంటే పాఠశాలను పూర్తిగా మూసివేసి రాజకీయాల్లో మెలగాలని తల్లిదండ్రులు హితువు పలికారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణ, సీఆర్ పీ హరినాథ్, విద్యాసంస్థల కరస్పాండెంట్ లు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News