Friday, March 13, 2026

ప్రశాంతంగా కొనసాగిన బీసీ బంద్…స్వచ్ఛందంగా బంద్ పాటించిన వర్తకులు,వ్యాపారస్తులు

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )స్థానిక సంస్థల ఎన్నికలలో విద్య మరియు ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంటే అడ్డుకున్నటువంటి అగ్రవర్ణాలకు మరియు న్యాయ వ్యవస్థ కూడా బీసీల పట్ల వ్యతిరేక తీర్పులను ప్రదర్శిస్తున్నందుకు నిరసనగా శనివారం బీసీ సంఘాల ఇచ్చిన పిలుపుమేరకు, తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ లో భాగంగా గొల్లపల్లి మండల కేంద్రంలో భారీగా తరలివచ్చి తెల్లవారుజాము నుండి విద్యాసంస్థలను, వ్యాపార వాణిజ్య సముదాయాల షాపులను, హోటలను, ప్రభుత్వ కార్యాలయాలైన బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయం ప్రశాంతంగా బంద్ చేయించి,గొల్లపల్లి మండల కేంద్రంలోని సుమారు నాలుగు గంటలు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీ బిల్లును తప్పనిసరిగ్గా గవర్నర్, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ బంద్ కార్యక్రమంలో బీసీ సంఘాలు ప్రజాసంఘాల నేతలు అన్ని సంఘలు అన్ని రాజకీయ నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News