Thursday, March 19, 2026

ప్రశాంతంగా ముగిసిన నవోదయ పరీక్షలు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 13పుంగునూరు నియోజవర్గం చౌడేపల్లి మండల కేంద్రమైన చౌడేపల్లి లో గల ఉన్నత పాఠశాలలో జవహర్ నవోదయ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.ఈ పరీక్షలు జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశానికి గాను జరుగుతున్నట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు.ఇంగ్లీష్ మీడియం లో 124 మంది తెలుగు మీడియంలో 36 మంది మొత్తం 160 మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు.ఇందులో బాలురు 89 మంది 71 మంది బాలికలు రాయాల్సి ఉండగా 24 మంది పరీక్షలకు గైహరాజరయ్యారన్నారు. చీప్ సూపర్ండెండెంట్ గా ప్రధానోపాధ్యాయుడు నాగరాజు రెడ్డి సి ఎల్ వో సెంటర్ లెవెల్ అబ్జర్వర్ గా నవోదయ పాఠశాల అధికారి శారద ల పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయన్నారు. చౌడేపల్లి తహసిల్దార్ పార్వతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో వీఆర్వోలు విజయ కుమార్,మంజుల, విఆర్ ఏ లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News