Tuesday, February 17, 2026

*ప్రశాంతంగా మేయర్, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ**జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల జిల్లా,, ఫిబ్రవరి 16,

నేటి సాక్షి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 1 నగరపాలక సంస్థ, 4 పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికలలో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో కలిసి ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన కార్పొరేటర్లతో మంచిర్యాల పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయ హాల్ లో ఎన్నికల పరిశీలకులు కె. గంగాధర్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్ గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ గా చల్లా రమ్య లను ఎన్నుకున్నారని తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 34 వార్డులలో గెలుపొందిన కౌన్సిలర్లతో బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, కమిషనర్ సంపత్ ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించి చైర్ పర్సన్ గా దావ స్వాతి, వైస్ చైర్ పర్సన్ గా రాగంశెట్టి సత్యనారాయణ లను ఎన్నుకున్నారని తెలిపారు. చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో గెలుపొందిన కౌన్సిలర్లతో చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం అనంతరం చైర్ పర్సన్ గా పెద్దింటి పద్మ, వైస్ చైర్ పర్సన్ గా నాయకపు వినయ్ లను ఎన్నుకున్నారని తెలిపారు. లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 15 వార్డులలో గెలుపొందిన కౌన్సిలర్లతో లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చైర్ పర్సన్ గా దొంత అంజలి, వైస్ చైర్ పర్సన్ గా మోతుకూరి రాజేశ్వరి లను ఎన్నుకున్నారని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 22 వార్డులకు ఎన్నికలు జరగగా సోమవారం రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేక ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను జిల్లాలో అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News