Saturday, March 21, 2026

*ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు* *గొల్లపల్లి మరియు చిలువకోడూరు నామినేషన్ సెంటర్ ని పరిశీలించిన జగిత్యాల డీఎస్పీ శ్రీ రఘు చందర్**

నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )ధర్మపురి నియోజకవర్గంలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ లు జరుగుతున్న సందర్భంగా గురువారం రోజున జగిత్యాల డిఎస్పి రఘుచందర్ గొల్లపల్లి మండలంలోని గొల్లపల్లి మరియు చిలువకోడూరు నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి, సిబ్బందికి తగు సూచనలను సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినామని తెలిపినారు. డీఎస్పీ వెంట ధర్మపురి సీఐ రాం నరసింహారెడ్డి మరియు గొల్లపల్లి ఎస్సై ఎం కృష్ణసాగర్ రెడ్డి లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News