నేటి సాక్షి ,నారాయణపేట, నవంబర్ 6,నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మరికల్ మండలాల్లో గ్రామ గ్రామాన కల్తీకల్లు జోరుగా కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ ఆరోపించారు. గురువారం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ కళ్ళు తయారీలో మరికల్ అడ్డగా మారిందన్నారు. మరికల్ మండల కేంద్రంలోని మాదరం వెళ్లే రహదారిలో కల్తీకల్లు జోరుగా తయారు చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు కూడా కల్తీకల్లు పై ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలించిన దాఖలు లేవని ఆయన ఆరోపించారు. కల్టికలు సేవించి వృద్ధులు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బందుల గురవుతున్న అధికారులు చూసి చూడనట్లు వారిస్తున్నారు. ధన్వాడ మండలంలో అదేవిధంగా మరికల్ మండలంలో కల్తీకల్లు నివారించకపోతే నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. కల్తీకల్లు జోరుగా కొనసాగుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా ధన్వాడ మరికల్ మండలాల్లో బెల్ట్ షాపులు విచ్చలివిడిగా కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.కల్తీకల్లుతో అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ధన్వాడ మరికల్ మండలాల్లోని వివిధ గ్రామాలలో మద్యం జోరుగా కొనసాగుతుందన్నారు. రాయచూర్ కి చెందిన ఒక వ్యక్తి పేట జిల్లా వ్యాప్తంగా కల్లు దుకాణాలను కొనసాగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాలలో చిన్న వయసులోనే కల్లుకు బానిసలు అవుతున్నారని ఆయన ఆరోపించారు. కల్తీకల్లు నివారించడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కల్తీకల్లు నివారించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.





