Tuesday, March 17, 2026

*ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్నాం.. మమ్మల్ని గుర్తించరా?* *సానిటేషన్ కార్మికుల ఆవేదన*

*నేటి సాక్షి సిరిసిల శివకుమార్* సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రభుత్వం వెంటనే కనీస వేతనం 26,000 అందించాలని హైదరాబాదులో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నాయకులు శ్రీరామ్ సదానందం గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి సానిటేషన్ కార్మికులు రోగులకు తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి సేవలందిస్తున్నారు ప్రభుత్వం వారి సేవలను గుర్తించడం లేదు 11వేల వేతనం తోటి కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆస్పత్రిలో 200 కొడుకులకు సరిపోయే కార్మికులు లేక కార్మికులపై విపరీతమైన పని భారం పెరుగుతుంది ప్రభుత్వం ఇచ్చే 15000 నుండి మా వద్ద నుండి పీఎఫ్ డబ్బులు కట్ చేసుకుని చేతికి 11,000 మాత్రమే కాంట్రాక్టర్ అందించడం జరుగుతుంది.ఈ సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదు వైద్యాధికారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు పెంచి పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో సమ్మెకు వెళ్లడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో లతా నాగమణి,విజయ్, లలిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News