Friday, March 13, 2026

*ప్రాణాల మీదకు తెచ్చిన సేల్ డిడి* *యామాపూర్ మాజీ ఉపసర్పంచ్ భర్త జనార్ధన్ ఆత్మహత్యాయత్నం* *అప్పుకోసం 82 గుంటల భుమి సేల్ డిడి* *ఇచ్చిన అప్పు రు.11 లక్షలు* *చెల్లించిన అప్పు రూ.8.30 లక్షలు* *మరో రూ.25 లక్షల డిమాండ్ చేయడంతో నిద్రమాత్రలు మిగిన జనార్దన్* *జనార్దన్ ను పరామర్శించిన కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి జువాడి నర్సింగరావు———

**నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )అవసరాన్ని కోసం అప్పు తీసుకుంటే.. ఇదే అదనుగా భావించిన అప్పు ఇచ్చిన మహానుభావుడు తనకున్న భూమిని సేల్ రెడీ చేసుకుని అధిక వడ్డీని వసూలు చేయడంతో పాటు మరో 25 లక్షలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. *యామాపూర్ లో జరిగిన దా’రుణం’*బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఎలేటి సుజాత భర్త ఎలేటి జనార్దన్ గత నాలుగు సంవత్సరాల క్రితం మెట్ పల్లి కి చెందిన వడ్డి వ్యాపారి గట్ల గణేష్, గట్ల లవణ్యల వద్ధ మొదట రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. సంవత్సరం గడిచిన తర్వాత వడ్డీకి వడ్డీ వేసి తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించడంతో యామాపుర్ గ్రామ శివారులోని 82 గుంటల భుమిని సుమారు రుపాయలు రూ.60 లక్షల విలువగల భూమిని సేల్ డిడి చేశారు. అప్పుడు రూ.11 లక్షల అప్పు ఇచ్చినట్లు లెక్క చెప్పాడు. జనార్ధన్ ఎప్పటికప్పుడు నెలనెలా వడ్డీ ఇచ్చే క్రమంలో ఏనాడు ఆగలేదు. తన భూమి తనకు రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తానని చెప్పిన సదరు వ్యక్తి పది రూపాయల వడ్డీ చొప్పున లెక్క చేసి రూపాయలు రూ.25 లక్షలు డిమాండ్ చేయటం ప్రారంభించాడు. వెంటనే రూ.25 లక్షలు ఇస్తేనే భూమి ఇస్తానని లేనిపక్షంలో గ్రామానికి వచ్చి గొడవ చేస్తానని బెదిరించడంతో చేసేదేమీ లేక శనివారం రాత్రి జనార్ధన్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన బంధువులు మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు. అదివారం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు.*వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి..*అవసరం కోసం అప్పు తీసుకుంటే ఇష్టం వచ్చినట్లుగా వడ్డీ వ్యాపారులు వడ్డీ వసూలు చేస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. సదరు వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చాలామంది ఉన్నారు. సేల్ డిడి పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారు.అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయ్యాలి. బాధ్యతలు నుండి దరఖాస్తులు తీసుకొని కేసులు నమోదు చేయ్యాలని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.*జనార్ధన్ ను పరామర్శించిన జువ్వాడి నర్సింగరావు*యామాపుర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఎలేటి సుజాత భర్త కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలేటి జనార్దన్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన తెలుసుకొని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు జనార్దన్ పరామర్శించారు. అధర్యపడవద్దని ధైర్యంగా ఉండి పోరాటం చేయాలని జనార్దన్ కు దైర్యం చెప్పారు.వడ్డీ వ్యాపారుల ఉచ్చులోపడ్డ జనార్ధన్ తో పాటుఇంకా ఎవరైన బాధితులు ఉంటే రక్షించాలని మెట్ పల్లి సిఐ అనిల్ ను నర్సింగరావు కోరారు.ఇక్కడ డాక్టర్ గడ్డం రమేష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అకుల లింగరెడ్డి, మాజీ ఎంపిపి నెరెళ్ళ దేవేంధర్, మార్కెట్ కమిటీ ఉపధ్యక్షుడు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News