*నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):* మండలంలోని చొక్కారావుపల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తరగతుల వారీగా సంక్రాంతి పండుగను తలపించే విధంగా రంగువల్లులు తీర్చిదిద్దారు. గౌరమ్మలను చేసి మధ్యలో నిలిపి ఆటపాటలతో పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అలరించారు. అనంతరం సర్పంచ్ గోపాల్ రెడ్డి హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

