నేటి సాక్షి (కరీంనగర్)ప్రాథమిక పాఠశాలల సమస్యల పరిష్కారానికి, వాటి పటిష్టతకు పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయ్యేవిధంగా చొరవ తీసుకోవాలని పిఆర్టియు తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి గారలు ఆదివారం రోజున హైదరాబాదులోనీ రంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరుగుతున్న పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు ఎం. చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు గార్లకు ప్రాతినిధ్యం చేశారు ఇప్పటికే ఉన్న ఎస్జీటీ పోస్టులను తగ్గించి వాటిని హైస్కూల్ కు పి.ఈ.టీ గా కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను పిఆర్టియు తెలంగాణ కరీంనగర్ జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. అట్టి సర్ ప్లస్ ఎస్జీటీ పోస్ట్ లను ప్రాధమిక పాఠశాల హెడ్మాస్టర్ (పిఎస్.హెచ్ఎం) గా మార్చే విధంగా రాష్ట్ర సంఘం తరపున ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ప్రాథమిక పాఠశాలలు విద్యారంగానికి పునాది వంటివి . కావున ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పిఎస్ హెచ్ఎం పోస్టును మంజూరు చేయాలి. జీ.ఓ 317 వలన వేరే జిల్లాలకు బదిలీ అయి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న స్పౌజ్ ఉపాధ్యాయుల బాధలను అర్థం చేసుకొని స్పౌజ్ ఉపాధ్యాయ బదిలీలు ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. కానీ ఇంకా కొద్దిమంది స్పౌజ్ ఉపాధ్యాయులు మిగిలిపోవడం జరిగింది. కావున మిగిలిపోయిన స్పౌజ్ ఉపాధ్యాయులకు కూడా బదిలీలు నిర్వహించి, వారికి న్యాయం చేయాలి.అలాగే 317 జీవో బాధితులందరికీ కూడా న్యాయం చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకాలపు వేతనాలు వెంటనే చెల్లించాలి. అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాతినిధ్యం చేయాలి. TET పై మినహాయింపు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ DA లు విడుదల అయ్యేలా, నూతన PRC ని ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రాతినిధ్యం చేయాలనీ పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు ఎం.చెన్నయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు గార్లకు పిఆర్టియు తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి గార్లు ప్రాతినిధ్యం చేశారు.





