నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా ఫోటోగ్రాఫర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ – 2 ముగింపు కార్యక్రమానికి ఎం ఎల్ ఏ డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై గెలుపొందిన విజేతలకు చెక్కులతో పాటు, బహుమతులు ప్రధానం చేసినారు.ఈ సందర్బంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతాయి అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆడువాళ లక్ష్మణ్, బాల ముకుందం ,రూరల్ మండల సర్పంచుల పోరం అధ్యక్షులు కట్ట రాజేందర్, లావుడ్యా సురేందర్ నాయక్,చిక్రంమారుతి,శ్రీనివాసరావు, గంగాధర్,హరీష్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





