నేటిసాక్షి, మిర్యాలగూడ : అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించేనాణ్యమైన ప్రీ స్కూల్ విద్య మానసిక అభివృద్ధికి దోహదం చేస్తుందని అర్భన్ సిడిపిఓ ఆర్.మమత అన్నారు. శనివారం మిర్యాలగూడ ప్రాజెక్ట్ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంప్ సెక్టార్ పరిధిలోని, ప్రకాష్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో బాల్య సంరక్షణ మరియు విద్య పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్భన్ సిడిపిఓ మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క ప్రీ స్కూల్ ప్రాముఖ్యతను చిన్నారులకు, తల్లిదండ్రులకు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు ఆట, పాటల ద్వారా ప్రీ స్కూల్ విద్యను నేర్చుకోవడం ద్వారా పిల్లల యొక్క మానసిక అభివృద్ధి మంచిగా జరుగుతుందని, వారిలో సృజనాత్మక అభివృద్ధి చెందుతుందని వారికి వివరించారు. చిన్నారుల తల్లిదండ్రులకు వారి యొక్క పిల్లలు తయారుచేసిన ప్రీ స్కూల్ ఆక్టివిటీస్ అన్నీ ప్రదర్శించి వారికి చూపించారు. ప్రీ స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రుల నుండి వారి యొక్క పిల్లలు కనబరిచే ప్రతిభను గురించి అడిగి తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తపరచారు. అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమాలు మరియు పౌష్టికాహారం గురించి అందరికీ ప్రదర్శించి చూపించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ లీలా కుమారి, బ్లాక్ కో ఆర్డినేటర్ కవిత, అంగన్వాడీ టీచర్ రాణి,హెల్పర్ సౌందర్య, లబ్ధిదారులు మరియు పిల్లల యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

