నేటి సాక్షి, తిమ్మాపూర్:తిమ్మాపూర్ ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గ నియామాకం ఆదివారం తాపాల లక్ష్మీనృసింహాస్వామి ఆలయంలో ఎన్నికల అధికారులు సిరిసిల్ల అనిల్ కుమార్, ముస్కు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరగ్గా.. అధ్యక్షుడిగా బత్తుల రాకేష్(సాక్షి) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వేల్పుల రాజు యాదవ్ (నమస్తే తెలంగాణ), ఉపాధ్యక్షులుగా ఎండీ రహీమ్(బిగ్ టీవీ), నాగెల్లి ఆంజనేయులు (మైత్రీ ఛానల్), కోశాధికారిగా భూమాడి శ్రీధర్ రెడ్డి(నమస్తే తెలంగాణ రూరల్), సహాయ కార్యదర్శులుగా తూముల శ్రీనివాస్, గోనె విష్ణువర్ధన్, కార్యవర్గ సభ్యులుగా జాప నాగరాజు, మర్రి రవి కుమార్, బొమ్మాడి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు.

