Monday, December 23, 2024

ప్రేమ పెండ్లికి ఏడాదే.. ఆ దంపతులు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో?

నేటి సాక్షి, నాగర్​ కర్నూల్​: ఆ జంట ఏడాది క్రితమే ప్రేమ పెండ్లి చేసుకుంది.. అంతలోనే ఏమైందో ఏమో గానీ, తమ పొలంలో ఉరేసుకున్నారు. ఈ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా బల్మూరు మండలం జినుకుంటలో శనివారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. జినుకుంటకు చెందిన మహేశ్​, భానుమతి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అమ్మాయి మైనర్​ కావడంతో మహేశ్​ జైలుకు వెళ్లాడు. జైలు జీవితం గడిపిన అనంతరం మహేశ్​ ఊరికి వచ్చి, భానుమతి తల్లిదండ్రులకు తెలియకుండా ఏడాది క్రితం ప్రేమ పెండ్లి చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ, దంపతులు ఇద్దరు శనివారం రాత్రి వారి పొలంలో చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు అచ్చంపేట సీఐ రవీందర్​ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News