నేటి సాక్షి: తిరుపతి జిల్లా ( బాదూరు బాల)వేసవి అనంతరం పాఠశాలలు పునః ప్రారంభవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ కార్యక్రమం గురువారం మండలంలోని కమ్మకండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి అధికారి మార్కోండయ్య నాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం తమ బాధ్యతగా భావిస్తోందని అందులో భాగంగా ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోందని తెలిపారు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య ఒక్కటే మార్గం అని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులతో పాటు, అర్హత, అనుభవం కలిగిన ఉపాద్యాయులు ఉన్నారని విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాటు చేసిందని ఇప్పటికే మండల పరిధిలోని అన్ని పాఠశాలలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయరాలు సునీత , కమిటీ చైర్మన్ చిట్టిబాబు,ఉపాద్యాయులు కృష్ణార్జున రెడ్డి,దిలీప్ కుమార్, ఎస్ ఎల్ టి ఎ జిల్లా అధ్యక్షుడు దొడ్డాఉమామహేశ్వరరావు, వెంకటరామయ్య, శాంతి, భార్గవి, జ్యోతి,విద్యార్థులు పాల్గొన్నారు