Tuesday, July 22, 2025

ప్రైవేటు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంఈఓ బాలు నాయక్

నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని జ్యోతి, సంస్కృతి లిటిల్ రాకెట్ పాఠశాలలను మండల విద్యాధికారి బాలు నాయక్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నోటీసు బోర్డుపై ఏర్పాటు చేసిన ఫీజుల వివరాలు, బస్సుల ఫిట్నెస్ వివరాలు, పాఠశాల గుర్తింపు కాపీలను పరిశీలించి, అన్ని ప్రైవేటు పాఠశాలలు తప్పకుండా నోటీస్ బోర్డ్ లో ఫీజు ల వివరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో ఏ ప్రైవేట్ పాఠశాలలోనైనా పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ అమ్మితే, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News