బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ : తిరుమలగిరి అశోక్ నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీనీ అరికట్టాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ భవన్ లో శుక్రవారం బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ, మిర్యాలగూడ పట్టణంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలలు& కార్పొరేట్ పాఠశాలలో, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అడ్మిషన్ ఫీజు పేరిట రూ. 5వేలు ఫీజు వసూళ్లు చేస్తున్న, కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో పిల్లల్ని చదివించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కత్తి మీద స్వాముల మారిందని పాఠశాలలలోని లక్షల రూపాయల ఫీజులు ఎలా కట్టాలో అని ఆందోళనకరంగా ఉన్నారని, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం, పాఠశాలల యాజమాన్యాలకు తొత్తుగా మారి, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక శోభకు గురిచేస్తున్నారని, జిల్లా విద్యాశాఖ అధికారులు యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాళ్లు నిర్ణయించిన ఫీజుకే విద్యార్థులను చదివించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, మిర్యాలగూడలో విద్యా వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ కూడా, అరికట్టవలసినటువంటి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆయన హెచ్చరించారు. పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాల లో చదువుకునే దుస్థితి లేకుండా పోయిందని, వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, ప్రైవేటు పాఠశాలలపై ఒక కమిటీని నిర్ణయించి, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో ఫీజుల దోపిడినీ అరికట్టకపోతే, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసరాజు జయరాజ్, సిద్ధం రాజు, నాయిని భాస్కర్, అంజి గౌడ్, గంగాధర్, ఉపేందర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.