పేట జిల్లా కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేసిన ప్రజాసంఘాల నేతలు…..
నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 13,
నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు మరికల్, కోస్గి ,మద్దూర్, మక్తల్ తదితర పట్టణాలలో ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం తమ ఇష్టానుసారంగా ఫీజులు నిర్ణయించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు బాలప్ప ,ఉడ్మల్ గిద్ద గోపాల్ సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం కలెక్టర్ రేట్ ఏవో జయసుధ గారికి శుక్రవారం రోజు వినతి పత్రం అందజేశారు .
ప్రైవేటు పాఠశాలల సరిపడు గదులు, మైదానము కనీస వసతులు కొరవడినవని తెలిపారు .అధిక బస్సు ఛార్జ్ వసులు చేస్తున్నారన్నారు
టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ ,షూస్ టై బెల్టు ప్రైవేట్ అందిస్తూ ప్రభుత్వ నిబంధనాలను అతిక్రమిస్తున్నాయని ఇలాంటి పాఠశాలలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు .
జిల్లాలో కొన్ని పాఠశాలల ను యజమానులు విద్యాశాఖ అనుమతి లేకుండా నడుపుతున్నారని ఇట్టి పాఠశాలల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వినతి పత్రం అందజేసిన వారిలో ఈ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు శివకుమార్ దామోదర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

