Tuesday, March 17, 2026

*ప్రైవేట్ కళాశాలను అడ్డుకుందాం* *——-గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ కృపా లక్ష్మి కి గజమాలతో ఘన సన్మానం*..

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) (*వెదురు కుప్పం.*) నవంబర్ 8 కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలందరూ ఏకమై అడ్డుకోవాలని జీడీ నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కృపా లక్ష్మి తెలిపారు. శుక్రవారం వెదురుకుప్పం మండలం పచ్చి కాపల్లం పం చాయతీ గ్రామాలలో పార్టీ అధ్యక్షులు జగన్మో హన్ రెడ్డి పిలుపుమేరకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ల ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కృపాలక్ష్మికి దాసరి కాలనీలో ప్రజలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. వైయ స్సార్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృపాలక్ష్మి మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణకు వ్యతి రేకంగా వైఎస్ఆర్సిపి ప్రజా ఉద్యమం లో భాగంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పంచాయితీ వైసిపి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో చాలామంది నిరుపేద విద్యార్థిని విద్యార్థులు మెడికల్ చదువులు చదివేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు మెడికల్ చదువులు చదవలేక దినస్థితికి చేరుతారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కామసాని పద్మనాభరెడ్డి, జడ్పిటిసి చలంపాళ్యం సుకుమార్, మాజీ జడ్పిటిసి బండి గోవర్ధన్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నాయకులు బట్టేసు బట్టే సుబ్రమణ్యం, మరకాల కుప్పం రామయ్య, నాయకులు బోడి రెడ్డి నరేష్ రెడ్డి, కోలార్ ప్రకాష్, కోఆప్షన్ సభ్యులు వెంకటేష్, లోకనాథరెడ్డి ధనంజయల్ రెడ్డి, గోవిందన్, నాగరాజు, పొన్నయ్య, మురళి, జగదీశ్ రెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News