ఆదర్శంగా నిలుస్తున్న గురుడుపేట మాజీ సర్పంచ్
నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి మే 23
కౌటాల మండలం, గురుడుపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మెర్పల్లి బ్రహ్మయ్య తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా విధానం మెరుగుపడటం, అలాగే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఆయన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సానుకూల మార్పులను గమనించిన బ్రహ్మయ్య, తన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పిల్లలు గురుడుపేటలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. ఈ పరిణామం ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం. కోడల మండ ప్రజలు బ్రహ్మయ్యను అభినందించినారు

