Sunday, March 15, 2026

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందాపై స్పందించని ఎంఈఓ.

ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి.

ఫీజుల దోపిడిని అరికట్టాలని ఆర్డిఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన.

ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్తా నాగరాజు.

నేటి సాక్షి, నర్సంపేట, జూలై0 3:నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి , ఫీజుల దోపిడీ కొనసాగిస్తున్నా , అనుమతి లేకుండా పుస్తకాలు అమ్ముతున్న స్థానిక ఎంఈఓ ఏమాత్రం పట్టించుకోవడంలేదని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ( ఏ ఐ ఎఫ్ డి ఎస్ ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు . 3 -7- 2025 రోజున ప్రైవేట్ పాఠశాలల ఆర్దిక దోపిడిని అరికట్టాలని కోరుతూ నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఏవో కు వినతిపత్రం అందజేశారు .ఈ సందర్భంగా ఏఐఎఫ్డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూనర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ , ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా ఇక్కడ విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ఎంఈఓ కు అనేక మార్లు ఈ దోపిడి పై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు .తక్షణమే ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని ,ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాల తో కుమ్మక్కైన నర్సంపేట ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు . లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కల్లపల్లి రాకేష్ పాల్గొన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News