నేటి సాక్షి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులలో రాయితీ ఇవ్వాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఫీజులలో 50% వరకు రాయితీ ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు.
ఆయన అన్ని స్కూల్ మరియు కాలేజ్ ల్లో స్వయంగా తిరిగారు.కార్పొరేట్ స్కూళ్లలో చదువుకుంటున్న ఫీజులలో రాయితీ ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో కార్మిక, పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజులలో రాయితీ ఇచ్చేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

