Wednesday, July 23, 2025

ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులకు నియంత్రణ ఏది…?

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్రాష్ట్రము లో కార్పొరేట్ స్కూల్ మొత్తం రాజకీయ నాయకులు వేగత మూడేళ్లలో ఎన్నో రెట్లు పెరిగిన ఫీజులు.ప్రభుత్వాలు ఉచిత లను ఏరా చూపి రాజ్యాంగ ఆదేశ సూత్రాలకు త్రిలోధకాలు.అందరికీ విద్య… నుండి ప్రభుత్వాలు తమ భాధ్యత లకు మంగళం.. 👉ప్రస్తుత రోజుల్లో చదువును ‘కొన్న’ వారే ఉన్నత స్థాయిలకు చేరుతున్నారు. 👉మిగతా వారి పరిస్థితి అధోగతే. ఎక్కడ చూసినా స్కూల్‌ ఫీజులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశంలోని పెద్ద, చిన్న నగరాలనే తేడా లేకుండా సర్వత్రా విద్య ఖరీదైనదిగా మారిందని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర మీడియా & జర్నలిజం వైస్ ప్రెసిడెంట్ జెరిపిటివీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్లో ఫీజు నియంత్రణ పై మాట్లాడుతూ…స్కూల్‌ ఫీజులు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు.లక్షల డబ్బు చెల్లించి పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు చతికిల పడుతున్నారని తన ఆవేదన తెలియజేశారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్కూల్‌ ఫీజులు గణనీయంగా పెరిగాయి. 5 శాతం దాటని ధనవంతుల సంగతి పక్కన పెడితే.. మిగతా 95 శాతం మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ఆర్థిక భారం మోయలేక పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక మనోవేధనకు గురవుతున్నారని అన్నారు. రాయచోటి నుంచి విశాఖపట్నం హైదరాబాద్ ,బెంగళూరు ఢిల్లీ వరకు సర్వాత్రా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలియజేశారు. ముఖ్యంగా గత మూడేళ్లలో స్కూల్‌ ఫీజులు అనేక రెట్లు పెరిగాయని స్కూల్‌ పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాల ఫీజులు మూడు ఏళ్లలోనే 50 నుంచి 80 శాతం పెరిగాయని తాజా జాతీయ సర్వే నిర్ధారించింది. స్కూల్‌ ఫీజులపై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్‌ స్కూల్‌ యాజమన్యాలు ఇష్టారీతిగా యేటా ఫీజులు పెంచుకుంటూ వెళ్తున్నారు. దీంతో పిల్లలను చదివించడానికి తల్లింద్రులకు తడిసి మోపెడవుతుంది అని తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల నియంత్రణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర.. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే పాఠశాల ఫీజులపై ఆయా ప్రభుత్వాల పట్టు ఉందని, అక్కడ ఫీజులు పక్కాగా నియంత్రిస్తున్నాయని పేర్కొంది. మరికొద్ది రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం (2025-26) ప్రారంభంకానున్న నేపథ్యంలో అధిక మంది తల్లిదండ్రులు స్కూల్‌ ఫీజులపై తీవ్రఆందోళనలో ఉన్నారని తెలియజేశారు. చాలీ చాలని జీతంతో సంసారాన్ని లాగే మధ్యతరగతి పౌరుడికి ప్రైవేట్ పాఠశాలల్లో పరిమితికి మించి పెరుగుతున్న ఫీజుల భారాన్ని మోయడం పెను సవాలేనని,మార్చి, ఏప్రిల్ నెలల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పాఠశాల ఫీజుల పెరుగుదలకు సంబంధించి ఫిర్యాదు దారులను ప్రైవేటు యజమానులు బెదిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యాశాఖ కార్యాలయాలలో మరియు ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ, స్థాపన,గుర్తింపు, పరిపాలన, మరియు నియంత్రణ నియమాలు 1993 యాక్ట్ మరియు….. “ఉచిత మరియు నిర్బంధ విద్యకు పిల్లల హక్కు నియమాలు 2010 యాక్ట్” మరియు “ఆర్ టి ఈ చట్టం 2009″అమలుపరచని రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబట్టారు. స్కూల్ ఫీజులను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగి విఫలమైనట్లు తెలిపారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ప్రభుత్వల వైఫల్యాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలు1) అందరి కి ఉన్నతమైన నాణ్యమైన సమానమైన విద్య అందించే భాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంది …ఇది వాస్తవం..2) రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ లోని ఆర్టికల్ 21 A కు తిలోదకాలిచ్చింది..4) ప్రభుత్వాలు నియంత్రణ శక్తి కోల్పోవడానికి కారణం.. ప్రభుత్వ ప్రధాన స్థానలలో..రాజకీయాలలోకి యాజమాన్యాలు ప్రవేశించడం.. లేదా లాభసాటి వ్యాపారమైన విద్య వ్యవస్థ లోకి రాజకీయ నాయకులు ప్రవేశం….ప్రధాన కారణం 5) అధికారం కోసం ….ఉచిత లను ఏరా గా చూపి.. ప్రభుత్వం విద్యా భాధ్యత కు మంగళం పాడింది..పై సమస్యలు అన్నిటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ యాజమాన్యంలో కనీస మౌలిక వసతులైన భవనాలు, ఆటస్థలాలు ,లైబ్రరీలు, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు,మరుగుదొడ్లు,ప్రహరీ గోడ, పారిశుద్ధ్య సౌకర్యాలు, భద్రత నియమాలు పాటించని,అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మరియు నియమ నిబంధనలు పాటించని వారి గుర్తింపు రద్దు చేయాలని ప్రజా సంకల్ప వేదిక ద్వారా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News