Sunday, April 12, 2026

ఫ్యూచర్ సిటీ పక్కనే గుంతల రోడ్లు.. కోళ్లపడకల్ ప్రజలకు ఇబ్బందులు సిద్ధాపూర్ రహదారి గుంతలతో ప్రమాదకరం గ్రామ కార్యదర్శుల పై పని భారం

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 14:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కోళ్లపడకల్ గ్రామంలో సర్పంచులు లేకపోవడంతో,అభివృద్ధి పనులు ఆగిపోయి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఫ్యూచర్ సిటీకి పక్కన ఉన్న ఈ కోళ్లపడకల్ గ్రామంలో కనీస రోడ్లు కూడా లేవు.ముఖ్యంగా 9,10వ వార్డులో ఈదమ్మ–పోచమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డులో గుంతలు,నీరు,బురద తో ప్రమాదకర స్థితి ఏర్పడింది,ఇంటిదగ్గర నుంచి పొలానికి,బజార్ కి వెళ్లాలంటే పాదచారులకు ఇబ్బంది తలెత్తుతోంది.అలాగే గ్రామం నుంచి సిద్ధాపూర్ వైపు రోడ్డు గుంతలతో నిండిపోయింది,దీనికి కారణం కంకర్ మిషన్ మరియు ఇటుకల లారీలు, మట్టి–ఇసుక తరలించే వాహనాలు, పరిమితికి మించిన లోడు మరియు వేగంతో సిద్దపూర్ టు హైదరాబాద్ స్పీడుకు మించిన లారీలు వేగం, కారణంగా రోజూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News