Thursday, March 19, 2026

*’ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్’ను ఆశీర్వదించిన అయ్యప్ప*—–* దర్శనం అనంతరం ‘శేష వస్త్రాల’చే పాత్రికేయులను సత్కరించిన ఆలయ కమిటీ —*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల అయ్యప్ప గుట్టపై కొలువై ఉన్న మణికంఠ స్వామిని సోమవారం ‘ఫ్రెండ్లీ ప్రెస్‌ క్లబ్‌’ పాత్రికేయులు దర్శించుకున్నారు.అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ స్వామి.. గురుస్వామి చిదురాల నారాయణ స్వామిలు పాత్రికేయులను ‘శేష వస్త్రాల’చే సత్కరించారు.*అయ్యప్ప ఆశీస్సులతో.. సమాజ శ్రేయస్సు.!*కోరుట్లలో కొలువైన అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో.. అష్టైశ్వర్యాలతో తులతూగాలని గురుస్వాములు ఆకాంక్షించారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు.. మంత్రోచ్చారణలు నిర్వహించారు.అనంతరం అయ్యప్పస్వామి ప్రసాదం.. భిక్ష పెట్టించి సమాజానికి ‘మీడియా’ ద్వారా చేతనైనా చేయూతనందించాలని గురుస్వాములు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు అంబటి శ్రీనివాస్ స్వామి,చిదురాల నారాయణ స్వామి, ఆకుల రంజిత్ స్వామి, గణేష్ స్వామి, సత్యనారాయణ,మాజీ ఎంపిపి తోట నారాయణ, ఫ్రెండ్లీ ప్రెస్ క్లబ్’అధ్యక్షులు చిలువేరి లక్ష్మీరాజం,ప్రధాన కార్యదర్శి కత్తి రాజ్ శంకర్, గౌరవ సలహాదారు రాధారపు నర్సయ్య, లీగల్ అడ్వైజర్ బద్రి సృజన్,సహాయ కార్యదర్శి వనతడుపుల సంజీవ్, కార్యవర్గ సభ్యులు విఆర్ భార్గవ్, రాధాకృష్ణ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు._____

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News