నేటి సాక్షి, కరీంనగర్: ఢిల్లీలో ఆదివారం కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ర్టపతి భవన్లో బండి పేరు పిలువగానే నినాదాలు మిన్నంటాయి. జై బండి.. అంటూ చప్పట్టు.. నినాదాలతో రాష్ర్టపతి భవన్ మారుమోగింది. ప్రధాని భుజం తట్టి, బండి సంజయ్‌ను అభినందించారు. ఆయన హిందీ భాషలో ప్రమాణం చేశారు. విదేశీ ప్రతినిధులు, అతిరథ మహారథులు హాజరైన కార్యక్రమంలో బండి పేరు మారుమోగడంపై సర్వత్రా చర్చ సాగింది.